Sunday, October 2, 2016

Questions to KCR on Telangana Finances

టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ సూటి ప్రశ్నలు

1.                   మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రెవిన్యూ ఎంత పెరిగింది?

2.                   పరిపాలనలో దుబారా పెరిగింది వాస్తవం కాదా?

3.                   పొదుపును పాటించి రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులను అదనంగా సమకూర్చారు?

4.                   మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం రెండేళ్లలో లక్ష కోట్ల అప్పుల రాష్ట్రంగా మారింది వాస్తవం కాదా?

5.                   రాష్ట్ర ప్రభుత్వ  ప్రణాళిక బడ్జెట్ లో పెట్టిన నిధులలో సగం కూడా ఖర్చు చేయని స్థితి వాస్తవం కాదా?

6.                   రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం జీత భత్యాలకు, పరిపాలనా నిర్వహణకు మాత్రమే సరిపోతున్నది వాస్తవం కాదా?

7.                   ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రగతి సాధిస్తే అది కేంద్ర ప్రభుత్వ సహకారం, నరేంద్ర మోడీ ఘనది అన్నది వాస్తవం కాదా?

8.                   ఆకస్మికం అవసరాల కోసం మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కింద 4,670 కోట్లు కేటాయించారు. ఈ పద్దు కింద ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు. కరువులో రైతులను ఆదుకోవడానికి, హైదరాబాద్ లో వరద బాధితులను ఆదుకోవడానికి ఈ నిధులను ఎందుకు ఖర్చు చేయలేదు?

9.                   నీటి ప్రోజెక్టుల కోసం 25 వేల కోట్లు మీరు కేటాయించారు. 6 నెలలు పూర్తి అయింది. ఇప్పటి వరకు కనీసం పావలా వంతు కూడా ఎందుకు ఖర్చు చేయలేదు. ఈ అంకెలు కేవలం ప్రజలను మసి పూసి మారేడుకాయ చేయడానికేనా?

10.               హడ్కో రుణం తో హైద్రాబాద్లో లక్ష ఇండ్లు, మిగితా జిల్లాల్లో ఒక లక్ష ఇండ్లను ఈ సంవత్సరంలో కట్టిస్తామన్న ప్రభుత్వం ఎందుకు కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోతుంది? హడ్కో రుణం పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం 90 వేళా ఇండ్ల కోసం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?

11.               జి హెచ్ ఎం సి కి జి హెచ్ ఎం సి నిధులు మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వం నగర ఎన్నికల్లో ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి?

12.               హెచ్ ఎం డి ఏ కి కేటాయించిన 865 కోట్లలో ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఏ వసతుల కోసం ఖర్చు చేశారు?

13.               వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నిజామాబాదు పురపాలక సంఘాలకు 1,200 కోట్లు కేటాయించారు. మరి ఆ నిధులకు ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదు. మీ మాటలు కేవలం నీటి మూటలేనా?

14.               మిషన్ భగీరథ కోసం ఖర్చు అయ్యే నిధులను  హడ్కో, నాబార్డ్, కెనరా బ్యాంకు, బ్యాంకు అఫ్ ఇండియా నుండి  సమకూర్చుకుంటాం అన్నారు. ఇప్పటి వరకు ఎంత ఋణం రాబట్టారు? ఎంత ఖర్చు చేశారు? మిషన్ భగీరథ పురోగతి ఎంత?

15.               మీరు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రూపాయికి కిలో భియ్యంలో, 32 రూపాయలకు కిలో భియ్యంలో, 29 రూపాయలు కేంద్రం భారిస్తుంటే మీరు కేవలం 2 రూపాయలు భరిస్తుంది వాస్తవం కాదా?

16.               స్వచ్చ భారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలను స్వచ్చ హైదరాబాద్, మేకిన్ తెలంగాణా, స్కిల్ తెలంగాణా అని పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది వాస్తవం కాదా?

17.               కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కనీసం ప్రధాన మంత్రి ఫోటోను కూడా ప్రచురించకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే ప్రచురించుకుంటూ ప్రోటోకాల్ ను ఉల్లఘిస్తున్నది వాస్తవం కాదా?

18.               అమిత్ షా అబద్ధాలు ప్రచారం చేసారంటున్నారు కదా? ఇంతకుముందే ప్రతి పైసాకు లెక్క చెప్పి నిజానిజాలను ప్రజల ముందు పెట్టాం. మరి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండానే 99 శాతం హామీలు నేరవేర్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిని ఏమనాలి? పచ్చి అబద్ధాల కోరు ఆనాలా లేక పచ్చి మోసకారి అనాలా?

19.               ఎంత సేపూ మేము ప్రవేశపెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇవ్వటం లేదు, మిషన్ భాగీరతకు డబ్బులు ఇవ్వట్లేదు అని టీ ఆర్ ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు కదా. టీ ఆర్ ఎస్ మేనిఫెస్టో కు, మీ రాజకీయ ప్రయోజనాలకు బీ జె పీ ఏమైనా కౌంటర్ గ్యారంటీ  ఇచ్చిందా మీరు ప్రవేశపెట్టే ప్రతి వోట్ బ్యాంకు పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడానికి?


20.               కరువుకు కేంద్రం రూ 791 కోట్ల నిధులు మంజూరు చేసిందని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మీరు ఎన్ని నిధులను కేటాయించారో ఇప్పటివరకు మీరు ప్రజల ముందు ఉంచారా? దీంతో ఎవరి చిత్తశుద్ధి ఏంటో అర్ధం కావడం లేదా?

No comments: