Sunday, October 2, 2016

Central Govts contribution to Warangal Development


వరంగల్ జిల్లాకు కేంద్రం వరాలు

1.    దేశంలోని 12 చారిత్రాత్మక నగరాలను గుర్తించి సంవత్సరానికి 40  అభివృద్ధి పరచివారసత్వ సంపద  పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచి ప్రజల ఆదాయం పెంచాలని భావించి కేంద్రం హృదయ్  పథకాన్ని ప్రారంభించగా దానిలో భాగంగా మొట్ట మొదటగా  వరంగల్. మొట్టమొదట  పథకానికి శంకుస్థాపన  చేసింది కూడా వరంగాల్  నగరంలోనే.

2.     హృదయ లో భాగంగా చారిత్రాత్మ వరంగల్ కోట పునరుద్ధరణభధ్రకాలి చెరువు చుట్టూ ట్యాంక్ బండ్  మాదిరిగా భధ్రకాలి బండ్ నిర్మాణం తదితర పనులు చేపట్టారు.

3.  దేశంలోని 100 నగరాలను గుర్తించి వాటిని సంవత్సరానికి 100  కోట్లతో ఆకర్షణీయమైన నగరాలనుగా తీర్చిదిద్దాలని కేంద్రం స్మార్ట్ సిటీస్ ని ప్రకటించగా మొదటి 100 స్మార్ట్ సిటీస్ లో వరంగల్ కు చోటు దక్కింది

4.    దేశంలో ఎడుగుతున్నతివంటి 500 నగరాలను అభివృద్ధి పరచాలని  ప్రారంభించి, దానిలో కూడా వరంగల్  మోడీ ప్రభుత్వం. రకంగా హృదయ్ , స్మార్ట్  , అమృత్  - మూడు పథకాల్లో చోటు కల్పించి, వరంగల్ రూపురేఖలు మార్చడానికి   కేంద్ర ప్రభుత్వం నడుం భిగించింది.

5.      1905 కోట్లతో యాదగిరిగుట్ట  వరంగల్ వరంగల్ వరకు 4 లేన్ జాతీయ రహాదారి

6.  వరంగల్ నుండి ఖమ్మం, వరంగల్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ జాతీయ రహాదారిగా మార్చాలని కేంద్రం ప్రతిపాదన

7.    వరంగల్ లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు,యువతకు  యువతకు ఉపాధి కల్పించాలని 100 కోట్ల సబ్సిడీతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమిని కేటాయించలేదుముఖ్యమంత్రి  వరంగల్ కు వచ్చి భూ సర్వే కోసమని గాలి మోటార్  లో తిరిగిండు గాలి మాటలు చెప్పిందు తప్ప భూమిని మాత్రం కేటాయించలేదు.

8.   వరంగల్ లో పరిశ్రమలు నెలకొల్పడానికి విమానాశ్రయం ముఖ్యమనిమరో 280 ఎకరాలను కేటాయిస్తే మమునూరు విమానాశ్రయం పూర్తి స్థాయి విమానాశ్రయం గా తీర్చిదిద్దుదామని కేంద్రం చెబుతుంటే ఇప్పటికీ దానికి భూమిని కేటాయించలేదు రాష్ట్ర సర్కార్. 20 కోట్లు కేటాయించి ప్రస్తుతమున్న విమానాశ్రయానికి ప్రహారీ గోడ కట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

9.     గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన రుర్బన్  పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా పర్వతగిరి మండలాన్ని  ఎంచుకొని 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.

10.  విద్యుత్తును అదా చేస్తూ వరంగల్ నగరం లో కాంతులు విరాజిల్లే విధంగా నగరం లోని అన్ని దీపాలలో  ఎల్..డి బల్బులను అమర్చడానికి కేంద్రం 81 కోట్లను కేటాయించింది.

11. వరంగల్ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం ని అభివృద్ధి చేయడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా 5 కోట్ల రూపాయల కేటాయింపు.

12.  వరంగల్ జిల్లాలో బీ జే పీ కి ఒక ఎం.పీ, ఒక ఎం.ఎల్. లేకపోయినా సికింద్రాబాద్ ఎం.పీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ప్రధాన మంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన క్రింద సన్నూర్, అన్నారం షరీఫ్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

13. మధ్య దళారీలను తొలగించి రైతులకు పంట దిగుబడి కి మెరుగైన ధర లభించడానికి ఉద్దేశించిన జాతీయ ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెట్ కు వరంగల్ మార్కెట్ ఎంపిక

14.  పరిశుబ్రత, పారిశుధ్యం కొరకు వరంగల్  జిల్లాకు ఏడాదికి వంద కోట్లకు పైగా స్వచ్ఛ భారత్ నిధులు.

15. వరంగల్  జిల్లాలో సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి 80 లక్షలుమున్సిపాలిటీకి 21 కోట్ల చొప్పున నేరుగా  గ్రామాలకు, నగర పంచాయతీలకు కేంద్రం నిధులను బాధలాయిస్తోంది. స్థానిక అభివృద్ధికి బాటల పరుస్తుంది.

No comments: